సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి : మేయర్ నీరజ

సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి : మేయర్ నీరజ
  • మేయర్ నీరజ

ఖమ్మం టౌన్, వెలుగు : సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఖమ్మం సిటీ మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు. సోమవారం ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలను మేయర్ స్వీకరించారు. నార్త్ జోన్ ( బల్లేపల్లి) కార్యాలయం, పాత మున్సిపల్(సౌత్ జోన్) కార్యాలయం,(సౌత్ జోన్) జమలాపురం కేశవరావు పార్క్ ఆఫీస్ లో గ్రీవెన్స్ నిర్వహించారు..

 ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను స్వయంగా ఆమె పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 30 అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.