ప్రజా సమస్యలు పరిష్కరించాలి : ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

ప్రజా సమస్యలు పరిష్కరించాలి : ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
  • కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు:  ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆఫీసర్లకు సూచించారు. శనివారం హుజూర్ నగర్ లో పడిగరాయి గుట్ట స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. పలు సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

కోదాడ, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులు ఏర్పాటు చేసేవారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కోరారు. చిలుకూరు మండల కేంద్రంలో యశోద ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రిని ఆమె శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  కేవలం పట్టణాల్లో  కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సౌకర్యం కోసం ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 

అనంతరం కోదాడ లోని క్యాంప్ కార్యాలయంలో వివిధ మండలాల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ ఆమె పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో పలువురు కాంగ్రెస్ నాయకులు, యశోద ట్రస్టు నిర్వాహకులు పాల్గొన్నారు.