
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయ 48 రోజుల హుండీ ఆదాయం రూ. 90,09,170 వచ్చినట్లు ఈవో అన్నపూర్ణ తెలిపారు. గురువారం దేవస్థానంలో లెక్కించిన ఆదాయం వివరాలను వెల్లడించారు. మిశ్రమ బంగారం 96గ్రాములు, మిశ్రమ వెండి 9కిలోల 50 గ్రాములు, విదేశీ కరెన్సీ 22 నోట్లు, మిశ్రమ బియ్యం 14 క్వింటాళ్లు వచ్చినట్లు తెలిపారు.
హుండీ లెక్కింపు కార్యక్రమంలో శివ రామకృష్ణ భజన మండలి సేవా సభ్యులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు.