కొత్తగూడలో రోడ్లకు మహర్దశ.. మంత్రి సీతక్క చొరవతో రూ.12 కోట్లు మంజూరు

కొత్తగూడలో రోడ్లకు మహర్దశ.. మంత్రి సీతక్క చొరవతో  రూ.12 కోట్లు మంజూరు

కొత్తగూడ, వెలుగు : మహబూబాబాద్​జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని రోడ్లకు మహర్దశ వచ్చింది. రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చొరవతో రోడ్ల వెడల్పునకు ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు అర్​అండ్​బీ శాఖ ఇంజినీర్లు టెండర్లు పిలిచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇల్లందు రోడ్డు 48వ కీలో మీటర్​రాయి నుంచి నర్సంపేట వైపు ఉన్న 50వ కిలో మీటర్ రాయి వరకు రోడ్డు విస్తరణ చేపడుతున్నారు. 

అలాగే ఓటాయి రోడ్డుకు భూర్కపల్లి వాగు బ్రిడ్జి వరకు, గుంజేడు రోడ్డులో డంపింగ్ యార్డ్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డును నాలుగు లైన్లుగా మార్చి మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తారు. రోడ్డు విస్తరణకు ప్రత్యేక చొరవ చూపిన మంత్రి సీతక్కకు  కాంగ్రెస్ మండల​అధ్యక్షుడు సారయ్య, బ్లాక్ కాంగ్రెస్​అధ్యక్షుడు మొగిలి, డీసీసీ జనరల్ సెక్రటరీ రూప్ సింగ్​ కృతజ్ఙతలు తెలిపారు.