విద్యార్థులు మత్తు పదార్దాలకు దూరంగా ఉండాలి : సినియర్ సివిల్ జడ్జి  రాజేందర్

విద్యార్థులు మత్తు పదార్దాలకు దూరంగా ఉండాలి : సినియర్ సివిల్ జడ్జి  రాజేందర్
  • కొత్తగూడెం జిల్లా సినియర్ సివిల్ జడ్జి  రాజేందర్

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కొత్తగూడెం జిల్లా సినియర్ సివిల్ జడ్జి  రాజేందర్ అన్నారు. బుధవారం మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, లేకపోతే జీవితం నాశనమవుతుందని చెప్పారు.

రోడ్లపై వెళ్తున్నప్పుడు  ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. స్టూడెంట్స్​ పరీక్షల సమయంలో  ఒత్తిడిని అధిగమించి మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. కార్యక్రమంలో జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్ బాలరాజు, ఏఎస్సై ప్రసాద్, టీచర్లు, స్టూడెంట్స్​పాల్గొన్నారు.