కుంభమేళా అలెర్ట్: వైద్యశాఖ ఏం చెబుతోందంటే..

కుంభమేళా అలెర్ట్: వైద్యశాఖ ఏం చెబుతోందంటే..

హైదరాబాద్: కుంభమేళాకు వెళ్లొచ్చిన వారిని గుర్తించే పనిలో పడింది వైద్యఆరోగ్యశాఖ. ముఖ్యమంత్రి సహా వీవీఐపీలంతా కరోనా బారినపడుతుంటే కనిపించడం లేదా.. ఏం చేస్తున్నారంటూ హైకోర్టు తీవ్ర అసంతృప్తి.. అసహనం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించిన నేపధ్యంలో వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. కరోనా కట్టడి చర్యలను కట్టుదిట్టం చేసే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కుంభమేళాకు వెళ్లొచ్చిన వారికి ప్రత్యేక సూచనలు చేసింది. ఈ నెల 1 నుంచి 17 వరకు కుంభమేళా లో పాల్గొన్న వాళ్లు స్వచ్ఛందంగా  క్వారoటైన్ లో ఉండాలని వైద్య శాఖ ఆదేశాలిచ్చింది. వారంతా 14 రోజులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని.. సామాజిక దూరం పాటిస్తూ.. ఇంట్లోనూ మాస్క్ ధరించాలని సూచించింది. ఏదైనా అనారోగ్య లక్షణాలు.. జలుబు, గొంతునొప్పి, తలనొప్పి , జ్వరం ఉన్నవాళ్లు వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. టెస్టులు చేయించుకున్న వారు రిజల్ట్ వచ్చే వరకు ఎవరినీ కలవకుండా.. సామాజిక దూరం పాటిస్తూ.. పరిశుభ్ర వాతావరణంలో ఉండాలని ఆయన కోరారు.