లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమం

లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమం
  • లతా మంగేష్కర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్..

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.  బ్రీచ్ కాండీ హాస్పిటల్ ICUలో వెంటిలేటర్ పై వైద్యుల పరిశీలనలో ఉన్నారు. గతనెల  8 వ తేదీన ఆమె కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ముంబయిలోని బ్రీచ్‌ కాండీ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి లతా మంగేష్కర్‌ కు.. ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మొదట ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, మెరుగుపడుతోందని చెబుతూ వస్తున్నారు.
శనివారం ముంబయి బ్రీచ్‌ కాండీ ఆస్పత్రి వైద్యులు గాయని లతా మంగేష్కర్‌ హెల్త్‌ బులిటెన్ ను విడుదల చేశారు. " నిన్నటి నుండి గాయని లతా మంగేష్కర్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆమె ఐసియులో వైద్యుల పరిశీలనలో ఉంది. ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. ఆమె తర్వలోనే కోలుకుంటుందని ఆశిస్తున్నాం" అంటూ వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ లో పేర్కొన్నారు. ఆమె తొందర్లోనే కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగొస్తారని ఆశిస్తున్న తరుణంలో  బ్రీచ్‌ కాండీ ఆస్పత్రి వైద్యలు తాజాగా ప్రకటించిన హెల్త్‌ బులిటెన్‌ లతా మంగేష్కర్‌ అభిమానులు, కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. 

 

 

 

ఇవి కూడా చదవండి: 

స్కూల్స్ రీఓపెన్ చేయండి.. లేకుంటే ఓటేయ్యం

కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు

యోగి వద్ద కోటిన్నర ఆస్తులు, రివాల్వర్‌‌, రైఫిల్

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయకుంటే నిరసన కాదా?