పోలీసుల కస్టడీలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్

 పోలీసుల కస్టడీలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్
  • గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అమృత్సర్ కోర్టులో హాజరుపర్చిన పంజాబ్ పోలీసులు

అమృత్సర్: గ్యాంగ్ స్టర్ రానా కండోవాలియా హత్య కేసులో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు పంజాబ్ పోలీసులు. అంతకుముందు అమృత్ సర్ కోర్టులో లారెన్స్ బిష్ణోయ్ ను హాజరు పరిచారు. రానా కండోవాలియా హత్య కేసులో ఈనెల 11 వరకు కస్టడీకి అనుమతించింది కోర్టు. 

గత ఏడాది ఆగస్టు 3న గ్యాంగ్ స్టర్ రానాను లారెన్స్ బిష్ణోయ్ కాల్చి చంపారు. ఈ కేసులో మజితా రోడ్ పోలీస్ స్టేషనులో లారెన్స్ బిష్ణోయ్ ను విచారించనున్నారు పోలీసులు. జూన్ 15న ఢిల్లీ నుంచి పంజాబ్ కు లారెన్స్ బిష్ణోయ్ ను తీసుకువచ్చారు. సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో మాన్సా పోలీసులు బిష్ణోయ్ ను ప్రశ్నించారు.