
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం LIC కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నట్లు ప్రకటించింది. ప్రతి శనివారం కార్యాలయాలను మూసివేయనున్నట్లు తెలిపింది. మే 10 నుంచి ఐదు రోజుల పని విధానం అమల్లోకి రానుంది. ఎల్‌ఐసీ ఉద్యోగులకు సంబంధించి కొన్ని డిమాండ్ల పరిష్కారంలో భాగంగా ప్రతి శనివారం సెలవు ప్రకటించాలన్న డిమాండ్‌కూ కేంద్రం ఏప్రిల్ 15న ఆమోదం తెలిపింది. దీంతో మే 10 నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే LIC కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేయనున్నాయని ఎల్‌ఐసీ తెలిపింది.