ఈ టూరిస్ట్‌‌ స్పాట్లు  మస్త్‌‌ వెతికిన్రు

ఈ టూరిస్ట్‌‌ స్పాట్లు  మస్త్‌‌ వెతికిన్రు

దాదాపు రెండేండ్లు అయ్యింది జనాలు టూర్లకు పోయి. కరోనా వల్ల ఆయా దేశాలు, రాష్ట్రాలు రిస్ట్రిక్షన్స్‌‌ పెట్టినయ్‌‌. ఇప్పుడు కరోనా కేసులు కాస్త తగ్గడంంతో కొన్ని దేశాలు రూల్స్​ ఎత్తేస్తున్నయ్‌‌. అందుకే, టూర్లు పోనీకి రెడీ అయితున్నరట.  ‘ఎక్కడికి పోవాలి? ఏ ప్లేస్‌‌ అయితే సేఫ్‌‌?’ అనే విషయంపై మనోళ్లు మస్త్‌‌ వెతికిన్రట. ఎక్కువగా ఫారెన్‌‌ ప్లేసుల గురించి ఆరాతీసిన్రట మనోళ్లు. వాటిల్లో యూఎస్‌‌, రష్యా, మాల్దీవులు ఫస్ట్‌‌ప్లేస్‌‌లో ఉన్నయ్‌‌.  స్విట్జర్లాండ్‌‌, ఖతార్‌‌‌‌ గురించి కూడా మస్త్‌‌ వెతికిన్రని ఒక సర్వేలో తేలింది.  లోకల్‌‌ ప్లేసుల విషయానికి వస్తే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలు టాప్‌‌ ఫోర్‌‌‌‌ ప్లేసుల్లో ఉన్నయ్‌‌. వాటి తర్వాత హైదరాబాద్‌‌, జైపూర్‌‌‌‌, ఉదయ్‌‌పూర్‌‌‌‌ టాప్‌‌ 10 ప్లేసుల్లో ఉన్నయ్‌‌. వాటితో పాటు ప్రకృతి అందాలను ఎంజాయ్‌‌ చేసేందుకు ఎక్కువగా లోనావాలా, లెహ్‌‌ లాంటి ప్రాంతాల గురించి వెతికిన్రట. అంతేకాకుండా సేఫ్‌‌ ప్లేస్‌‌ ఏంటి? అక్కడ సేఫ్టీ రూల్స్‌‌ ఎట్లున్నయ్‌‌ అనేదానిపై ఆరా తీసిన్రట చాలామంది. ఈ కరోనా తర్వాత అకామిడేషన్‌‌ కోసం హోట్స్‌‌ కంటే గెస్ట్‌‌ హౌస్‌‌లు, విల్లాలు, అపార్ట్‌‌మెంట్లను ఎక్కువగా ప్రిఫర్‌‌‌‌ చేస్తున్నరట చాలామంది.