తక్కువ వడ్డీకి కరెంటు బండ్లు

తక్కువ వడ్డీకి కరెంటు బండ్లు

కరెంటు వాడకం తగ్గిస్తం
త్వరలో గ్రీన్ బాండ్స్ జారీ
 ప్రకటించిన హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్

హైదరాబాద్, వెలుగు: 2031–32 నాటికి కార్బన్ న్యూట్రల్‌‌‌‌గా మారుతామని, విషవాయులను, ఎలక్ట్రిసిటీ, నీటి వాడకాన్ని భారీగా తగ్గిస్తామని హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంకు ప్రకటించింది. ఇందుకోసం తయారు చేసిన ప్లాన్లను  బ్యాంక్ గురువారం ప్రకటించింది. ఒక కంపెనీ తన కారణంగా విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ విషవాయువులను తగ్గించడాన్ని కార్బన్ న్యూట్రల్ అంటారు.  ఇందుకోసం హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ తన కార్యకలాపాలలో సోలార్ పవర్ వంటి పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరింత పెంచుతుంది. తన ఎన్విరాన్మెంటల్, సోషల్ గవర్నెన్నస్ (ఈఎస్జీ) వ్యూహంలో భాగంగా, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి పర్యావరణ అనుకూల ప్రొడక్టులకు తక్కువ వడ్డీ రేటుకు లోన్లు ఇస్తుంది. లోన్లు ఇచ్చేటప్పుడు ఈఎస్జీ స్కోర్‌‌‌‌లను చేర్చడంపై కూడా బ్యాంక్ దృష్టి సారించనుంది. గ్రీన్ బాండ్ల జారీకి ఒక ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌ తయారీ కోసం కూడా బ్యాంక్ పనిచేస్తోంది. జూన్ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం  నేపథ్యంలో హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ ఈ ప్రకటన  చేసింది.
 భారీగా కార్బన్ డయాక్సైడ్ తగ్గింపు
ప్రస్తుతం 315,583 మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుండగా, దీనిని భారీగా తగ్గిస్తుంది.  పెద్ద ఆఫీసుల్లో సోలార్ రూఫ్‌‌‌‌లను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు వాడుతున్న కరెంటులో  50 శాతం సోలార్ పవర్ ఉండేలా చూస్తారు. కార్పొరేట్ ఆఫీసులను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ గా మార్చుతారు. దేశమంతటా 25 లక్షల చెట్లను నాటుతారు. నీటి వాడకాన్ని 30శాతం తగ్గిస్తారు. షేర్డ్ ఫ్యూచర్ అంటే వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి వ్యక్తులు, కంపెనీలు, ప్రభుత్వం కలిసి పనిచేయడమని హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్, సిఎస్ఆర్, బిజినెస్ ఫైనాన్స్ అండ్ స్ట్రాటజీ, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ హెడ్ అషిమా భట్ ఈ సందర్భంగా అన్నారు.