బంగాళాఖాతంలో అల్పపీడనం : హైదరాబాద్ లో కూల్ వెదర్, అక్కడక్కడ చిరు జల్లులు

బంగాళాఖాతంలో అల్పపీడనం : హైదరాబాద్ లో కూల్ వెదర్, అక్కడక్కడ చిరు జల్లులు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ  తెలిపింది. దీని ప్రభావంతో 2023  నవంబర్ 6వ తేదీ సోమవారం.. హైదరాబాద్‌లో ఇప్పటికే వాతావరణ కూల్ గా ఉంది. ఎండ తీవ్రత లేదు. మామూలుగా అయితే 30 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ నమోదు అవుతుంది.. సోమవారం మాత్రం 27 డిగ్రీలుగానే నమోదైంది. దీనికితోడు చలి ఉండటంతో.. హైదరాబాద్ మరింత కూల్ అయ్యింది వెదర్. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు, నాలుగు రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించారు అధికారులు. ఇప్పటికే చెన్నై, కేరళలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆ ప్రభావం కూడా ఏపీలోని సీమపై ఉంది. రెండు రోజులుగా ఏపీలో వాతావరణం చల్లగా ఉంది.. అల్పపీడన ప్రభావంతో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది.

ALSO READ : ఢిల్లీలో పడిపోయిన వాయు నాణ్యత.. కేజ్రీవాల్‌ ఉన్నతస్థాయి సమావేశం

బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫాన్ గా మారుతుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో స్పష్టం కానుంది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. నవంబర్ నెలలో బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడే సూచనలు ఉన్నాయి.  ప్రస్తుతం చలికాలమే అయినప్పటికీ..  తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం పొంగమంచు ప్రభావం చూపిస్తుండగా, పగటి పూట ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గటం లేదు. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ వర్షాలు కాస్త  ఉపసమనం కలిగిస్తాయో చూడాలి.