మిస్టరీ ఏంటీ : బంజారాహిల్స్ ట్రాఫిక్ బాక్సులో రక్తంతో ఉన్న డెడ్ బాడీ

మిస్టరీ ఏంటీ : బంజారాహిల్స్ ట్రాఫిక్ బాక్సులో రక్తంతో ఉన్న డెడ్ బాడీ

హైదరాబాద్ సిటీ సెంటర్.. బంజారాహిల్స్ తాజ్ కృష్ణ అంటే వెల్ నోటెడ్.. అలాంటి ఏరియాలో.. నడి రోడ్డుపై ట్రాఫిక్ బూత్ బూత్ బాక్స్ ఉంది.. ట్రాఫిక్ పోలీసులు ఈ బూత్ బాక్సులో ఉండి వాహనాలకు కంట్రోల్ చేస్తూ ఉంటారు.. సిగ్నల్ ఆపరేటింగ్ పర్యవేక్షిస్తుంటారు.. రాత్రి 10 గంటల వరకు ఈ బూత్ లోనే ట్రాఫిక్ పోలీసులు ఉన్నా.. ఆ తర్వాత ఆటోమేటిక్ గా సిగ్నల్ వ్యవస్థ నడుస్తుంది.

 అలాంటి ట్రాఫిక్ బూత్ బాక్సులో.. ఒంటిపై రక్తంతో ఉన్న ఓ డెడ్ బాడీ కనిపించటం సంచలనంగా మారింది. అది కూడా నిత్యం రద్దీగా ఉంటే బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ సమీపంలోని ట్రాఫిక్ బూత్ బాక్సులో కావటం మరింత ఆసక్తి రేపుతోంది.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్ కృష్ణ హోటల్ ముందున్న  ట్రఫిక్ బూత్ లో స్థానికులకు రక్తం కనిపించింది. ఏంటా అని చూసిన జనం ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. రక్తపు డుగులో ఉన్న ఓ డెడ్ బాడీని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు డెడ్ బాడీ ఉన్న ప్రదేశానికి చేరుకుని పరీక్షించారు. బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటన పై కేసు నమోదు చేసుకుని హత్య ఎవరు చేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.