మూత్రం అర్జంట్ అని వందే భారత్ ఎక్కాడు.. రూ.6 వేలు కట్టాడు..

మూత్రం అర్జంట్ అని వందే భారత్ ఎక్కాడు.. రూ.6 వేలు కట్టాడు..

ప్రపంచం ఎంత ముందుకు వెళ్లినా..మనోళ్ల ఆలోచన అస్సలు మారదు. 5 రూపాయిలు ఖర్చుతో టాయిలెట్ వాడుకోవాల్సింది పోయి ఏకంగా 6వేల రూపాయిలు ఫైన్ కట్టాడు ఓ ప్రబుధ్ధుడు. జస్ట్ యూరిన్ పోయడానికి వందేభారత్ ట్రైన్ ఎక్కాడు..పాపం మరీ అర్జెంటో లేక ..నీట్ గా ఉంటుంది  ఓ సారి చూసొద్దామనుకున్నాడో ఏమో తెలియదు కాని...  పాపం..ఆ పని చేసుకొని వచ్చేసరికి వందేభారత్ డోర్లు క్లోజ్ అయ్యాయి.

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఇది జరిగింది. అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తి ఫ్రూట్స్‌ వ్యాపారి. అతడికి హైదరాబాద్‌తో పాటు సొంత ఊరైన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో ఫ్రూట్స్‌ షాపులున్నాయి. జూలై 15న భార్య, ఎనిమిదేళ్ల కుమారుడితో కలిసి హైదరాబాద్‌ నుంచి భోపాల్‌కు రైలులో ప్రయాణించి సాయంత్రం 5.20 గంటలకు రీచ్ అయ్యాడు. రాత్రి 8.55 గంటలకు సొంతూరుకు వెళ్లే రైలు ఎక్కాల్సి ఉంది. దీంతో స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్‌పై  వెయిట్ చేస్తున్నాడు. కాని  అబ్దుల్ ఖాదిర్ అర్జెంట్‌గా టాయిలెట్ కి వెళ్లాల్సి వచ్చింది.  దీంతో ఆ ఫ్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న ఇండోర్‌ వెళ్లే వందే భారత్‌ రైలులోని టాయిలెట్‌లోకి వెళ్లాడు.

టాయిలెట్‌ నుంచి బయటకు రాగానే రైలు డోర్లు మూసుకుపోయాయి. ఆ వెంటనే వందే భారత్‌ రైలు భోపాల్‌ స్టేషన్‌ నుంచి కదిలింది. దీంతో టెన్షన్ తో అబ్దుల్‌, ముగ్గురు టీసీలు, నలుగురు పోలీస్‌ సిబ్బందిని సంప్రదించి వారి సహాయం కోరాడు. టికెట్‌ లేకుండా వందే భారత్‌ రైలు ఎక్కినందుకు రూ.1,020 జరిమానా చెల్లించాడు. తర్వాత స్టేషన్‌ ఉజ్జయినిలో ఆ రైలు దిగాడు. రూ.750 చెల్లించి అక్కడి నుంచి బస్సులో భోపాల్‌ చేరుకున్నాడు.మరోవైపు భోపాల్‌ రైల్వే స్టేషన్‌లో వేచి ఉన్న అబ్దుల్ ఖాదిర్ భార్య పిల్లలు ..ఇక ట్రావలింగ్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఫైన్లు ...ట్రైన్ టికెట్లు అన్నీ కలిపి ఖాదిర్ కు 6 వేలు వదిలిపోయి..సార్ సుసు స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.