కారు పైకప్పుపై వ్యక్తి స్టంట్.. 26 వేల జరిమానా

కారు పైకప్పుపై వ్యక్తి స్టంట్.. 26 వేల జరిమానా

ఢిల్లీ సమీపంలోని నోయిడా ఓ వ్యక్తి కదులుతున్న కారు పైకప్పుపై పడుకుని స్టంట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెక్టార్ 18లో ఢిల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్ గల మారుతీ స్విఫ్ట్ కారు పైకప్పుపై పడుకొని తోటి వాహనాదారులకు భయాందోళన కలిగించేలా స్టంట్ చేశాడు. ఈ ప్రమాదకరమైన స్టంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ కావడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల కంటపడింది. నెంబర్ ప్లేట్ ఆధారంగా ఓనర్ ఎవరూ ఆరా తీసిన ట్రాఫిక్ పోలీసులు.. అతనిని మహేష్ పాల్ గా గుర్తించి రూ. 26వేల ఫైన్ వేశారు. జరిమానా కు సంబంధించిన చలాన్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
ఈ వీడియోలో కారు పైకప్పుపై పడుకుని వ్యక్తి పడుకొని ఉండగా నోయిడా రోడ్లపై వేగంగా దూసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేస్తూ లెఫ్ట్.. రైట్ తిప్పుతూ అడ్డదిడ్డంగా కారును  వేగంగా నడిపాడు మరో వ్యక్తి. దీంతో వాహనదారులు, అటు చూస్తున్నవారంతా షాక్ కు గురయ్యారు. ఈ వీడియోను ఇతర వాహనదారులు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేసి  ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కారు యజమానిపైకఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకేముందు రంగంలో దిగిన పోలీసులు కారు ఓనరు మహేష్ పాల్ గా గుర్తించి రూ. 26వేల జరిమాని విధించారు. పలు మోటార్ వెహికిల్  సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు టింటెడ్ గ్లాస్ వాడినందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా అతనిపై అభియోగాలు మోపారు.