కర్ణాటకలో దారుణం: దెయ్యం పట్టిందని తీసుకెళ్తే కొట్టి చంపిన మహిళా..

కర్ణాటకలో దారుణం: దెయ్యం పట్టిందని తీసుకెళ్తే కొట్టి చంపిన మహిళా..

కన్న తల్లినే ఓ కొడుకు కొట్టించి చంపించాడు. ఎం జరిగిందో తెలీదు కానీ తన తల్లికి దయ్యం పట్టిందని, ఆమెకి పట్టిన దయ్యాన్ని వదిలించడానికి ఓ మహిళల చెప్పిన మాటలు నమ్మాడు. చివరకు అతను చేస్తుందనే తన తల్లి చనిపోయింది.  

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 55 ఏళ్ల గీతమ్మ అనే మహిళకి దెయ్యం పట్టింది అని  అపోహతో ఆమెను తీవ్రంగా  కొట్టి  చంపారు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. గీతమ్మ కుమారుడు సంజయ్,  ఆశా  అనే మహిళా పై పోలీసులు హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

పోలీసుల కధనం ప్రకారం గీతమ్మకు దయ్యం  పట్టిందని ఆమె కుమారుడు సంజయ్ బలంగా అనుమానించాడు. దీంతో ఆమెకి పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి  ఒక కర్మ చేస్తానని చెప్పిన ఆశా అనే మహిళ వద్దకు తన తల్లిని తీసుకెళ్లాడు. అక్కడ ఆశా తన భర్త సంతోష్‌తో కలిసి భూతవైద్యం పేరుతో ఓ ప్రక్రియ ప్రారంభించింది.

ఆశా తనను తాను భూతవైద్యురాలిగా చెప్పుకుంటూ గీతమ్మ తల చుట్టూ నిమ్మకాయను తిప్పి, ఆ తర్వాత అదే నిమ్మకాయతో గీతమ్మ తలపై పదేపదే కొట్టింది. ఆ నిమ్మకాయను రెండు భాగాలుగా చీల్చి గీతమ్మ తలపై రుద్ది పగలగొట్టింది. ఆ తర్వాత ఆశా కర్ర తీసుకుని వృద్ధురాలైన గీతమ్మను పదేపదే కొట్టడం మొదలుపెట్టింది. గీతమ్మ తనను తాను కాపాడుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ  దారుణం అంత కూడా సిసి కెమెరాలో రికార్డయింది.

కెమెరాలో రికార్డైన ఈ దాడి సోమవారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:00 గంటల వరకు కొనసాగినట్లు తెలుస్తోంది. అయితే దెబ్బల కారణంగా గీతమ్మ తీవ్ర గాయాలతో అక్కడే మరణించింది. ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి  గీతమ్మ కుమారుడు సంజయ్, ఆశా, సంతోష్‌లను అరెస్టు చేశారు.
 
గత వారం బీహార్‌లోని పూర్ణియా జిల్లాలోనూ ఇలాంటి దారుణమే జరిగింది. మంత్రవిద్య చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురుని  సజీవ దహనం చేశారు. వీరిలో సీతాదేవి 16 ఏళ్ల కుమారుడు సోను కుమార్ దాడి నుండి తప్పించుకోగలిగాడు.