కొత్త ప్రభాకరరెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల .. చిన్న పేగుకు నాలుగు చోట్ల గాయాలు

కొత్త ప్రభాకరరెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల .. చిన్న పేగుకు నాలుగు చోట్ల  గాయాలు

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులిటెన్ ను యశోదా ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. కత్తి గాయాలతో కొత్త ప్రభాకర్ రెడ్డి  తమ ఆస్పత్రికి వచ్చారని యశోదా ఆస్పత్రి వైద్యులు తెలిపారు.  CT స్కాన్ చేశాం.. చిన్న పేగుకి 4 చోట్ల గాయాలయ్యాయన్నారు.. చిన్న పేగును 15 సెంటీ మీటర్ల మేర కట్ చేసి సర్జరీ చేశామని డాక్టర్లు వెల్లడించారు. లాప్రో స్కోప్ ద్వారా సర్జరీ చేద్దాం అనుకున్నాం.. కానీ మల్టిపుల్ ఇంజురీస్ కనిపించాయి.. త్వరగా తీసుకురావడం వల్లే.. ప్రభాకర్ రెడ్డికి ప్రాణాపాయం తప్పింది.. రక్తస్రావం ఎక్కువ అయిందని.. మూడు నాలుగు రోజులు ఐసీయులో డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలన్నారు.

మరో 10 రోజులు హాస్పిటల్ లోనే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండాల్సి వస్తుంది అని యశోదా హస్పటల్ వైద్యులు వెల్లడించారు. షార్ప్ ఆబ్జెక్ట్ అవడంతో.. డెప్త్ ఎక్కువగా ఉంది. రెండు లేయర్లు కట్ అయ్యాయి.. ల్యాప్రాటమీ అనేది మెడికల్ టెర్మినాలజీ లో చాలా పెద్దది. ఆ సర్జరీ ప్రభాకర్ రెడ్డికి చేశాం.. బొడ్డుకి కుడిభాగాన 6 సెంటీమీటర్ల కత్తి గాటు గాయమైందని తెలిపారు.. సిటి స్కాన్ లో శరీరం లోపల బ్లీడింగ్ అవుతునట్టు గుర్తించాంమని హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. వెంటనే హాస్పిటల్ తీసుకురావడంతో ఇన్ఫెక్షన్ కాకుండా ఆపగలిగాం.. ప్రాణాపాయం తప్పింది.. దాదాపు 100 మంది వైద్యులు ఒక టీం గా పని చేసామని.. కత్తి గాట్లు  లోపల ఎక్కువగా ఉన్నాయని యశోదా ఆస్పత్రి  డాక్టర్లు పేర్కొన్నారు.  గజ్వేల్ ఆస్పత్రిలో ప్రాథమికంగా కుట్లు వేసి ఇక్కడకు పంపించారని తెలిపారు. మెడికో లీగల్ కేస్ కాబట్టి అన్ని శాంపిల్స్ సేకరించామన్నారు.  ఈ తరహా శస్త్ర చికిత్స జరిగినప్పుడు రోగి త్వరగా కోలుకోవడం కష్టమని  యశోదా వైద్యులు తెలిపారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి  ఆరోగ్యస్థితిని తెలియజేస్తామని తెలిపారు.  మెడికో లీగల్ కేస్ కాబట్టి అన్ని శాంపిల్స్ సేకరించామన్నారు.