
- ఒడిశాలో రైల్వే ఆఫీసర్లతో సింగరేణి కీలక మీటింగ్ లో కీలక నిర్ణయం
కోల్‌బెల్ట్,వెలుగు : ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌నుంచి బొగ్గు రవాణాకు గురువారం సింగరేణి కంపెనీ, సంబల్పూర్ రైల్వే డివిజన్ ఆఫీసర్లతో మీటింగ్ జరిగింది. సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి.వెంకన్న జాదవ్ఆధ్వర్యంలో సంబాల్పూర్ లో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. నైనీ ఓపెన్‌కాస్ట్ మైన్‌లో ఉత్పత్తయ్యే బొగ్గును సమీపంలోని జారపాడ, హండప్పా రైల్వే గూడ్స్షెడ్ల నుంచి రవాణా, లోడింగ్, హ్యాండ్లింగ్, స్టాక్, మౌలిక వసతుల ఏర్పాటు, పర్మిషన్లపై ఆఫీసర్లు సమీక్షించారు.
రోజూ మూడు రేక్‌ల వరకు బొగ్గు రవాణా కేటాయింపుకు సంబల్పూర్ రైల్వే డివిజన్ ఆఫీసర్లు అంగీకరించారు. దీంతో తమిళనాడు, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా మరింత స్పీడ్ కానుందని ఆఫీసర్లు తెలిపారు. సంబల్పూర్ రైల్వే డివిజన్ఏడీఆర్ఎం మంజీత్ సింగ్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ ఆఫీసర్ గరీమా, డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ కుముద్ రంజన్, సింగరేణి ఆఫీసర్లు పాల్గొన్నారు.