ఫిఫా వరల్డ్ కప్ 2026 లో కొత్త చరిత్ర నమోదైంది. అర్జెంటీనా ప్లేయర్ లియోనెల్ మెస్సీ కెరీర్ లో తొలి హ్యాట్రిక్ గోల్స్ సాధించి రికార్డ్ సృష్టించాడు. 2026 జూన్ 17న అల్జీరియాతో జరిగిన మ్యాచ్ లో వరుసగా మూడు గోల్స్ కొట్టి.. కొత్త చరిత్ర లిఖించాడు. దీంతో గ్రూప్ జెలో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా అల్జీరియాపై 3-0 తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
మ్యాచ్ ప్రారంభమైన ఫస్ట్ హాఫ్ లో ఒక గోల్ సాధించిన అర్జెంటీనా కెప్టెన్.. ఆట తిరిగి ప్రారంభమైన వెంటనే మరో గోల్ చేసి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాడు. ఆ వెంటనే మరో గోల్ తో.. హ్యాట్రిక్ గోల్స్ సాధించి.. యారోహెడ్ స్టేడియంలో అభిమానుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నాడు. మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ తో స్టేడియం అంతా మెస్సీ.. మెస్సీ.. మెస్సీ అనే అరుపులతో మారుమోగింది. అపోనెంట్ టీమ్స్, ఫ్యాన్స్ కూడా మెస్సీకి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం ఆకట్టుకుంది.
మెస్సీ వరల్డ్ కప్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 ఏళ్లయింది. కెరీర్ లో మెస్సీకి ఇది 200వ మ్యాచ్. సెర్బియా, మాంటెనెగ్రోపై మెస్సీ ప్రపంచ కప్ అరంగేట్రం చేసిన మెస్సీ.. ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో గోల్స్ సంఖ్యను 16 కు చేర్చాడు. దీంతో ఆల్-టైమ్ స్కోరింగ్ చార్టులలో టాప్ లో ఉన్న జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోస్ ను సమం చేశాడు.
టోర్నమెంట్‌కు ముందు తొడకండరాల నొప్పితో ఇబ్బంది పుడిన మెస్సీ.. ఫీల్డ్ లోకి ఎంట్రీ అయ్యాక చిరుత పులిలా కదులుతూ ఆట కోసం గాయాలను కూడా లెక్కచేయనని చాటిచెప్పాడు. 38 ఏళ్ల మెస్సీ ఆట చూస్తే చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఈ మ్యాచ్ లో హ్యాట్రిక్ గోల్స్ చేసిన మెస్సీ.. మరిన్ని గోల్స్ చేసేవాడే. కానీ ఒక గోల్‌ను ఆఫ్-సైడ్ కారణంగా తిరస్కరించగా, మరొకటి బార్ పైనుంచి తృటిలో వెళ్లిపోయింది.
1982 , 1990 ప్రపంచ కప్ లలో ప్రారంభ మ్యా్చ్ లలో ఓడిన అర్జెంటీనా.. ప్రపంచ కప్‌లో ఓపెనింగ్ మ్యాచ్‌ను గెలుచుకోవడం అర్జెంటీనాకు ఇదే మొదటిసారి.
