మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఉద్రిక్తత

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఉద్రిక్తత

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగా గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.  చెన్నరావు పేట మండలం పదహారు చింతలు గ్రామంలో జరిగిన కుటుంబ హత్య ఘటన నేపథ్యంతో గుండెంగా గ్రామంలో పోలీసులు భారీగా భారీగా మొహరించారు.  నిందితుడు  గుండెంగా గ్రామం మేకల బన్నీ s/o మేకల రమేష్ ని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పోలీసుల పహారాలో గుండెంగా గ్రామం ఉండటంతో  బంద్​ వాతావరణాన్ని తలపిస్తుంది.  నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు ఆందోళన చేశారు.  గ్రామంలో ఎటువంటి గొడవలు, అల్లర్లు జరగకుండా పోలీసులు బందోబస్తు  నిర్వహిస్తున్నారు.  ఈ ఘటనపై ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.