విజయ్ దేవరకొండ మూవీలో మైక్ టైసన్

విజయ్ దేవరకొండ మూవీలో మైక్ టైసన్

బాక్సింగ్ యోధుడు మైక్ టైసన్.. తెలుగు వెండితెరపై కనిపించనున్నాడు. విజయ్ దేవరకొండ.. అనన్యపాండే జంటగా.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ సినిమాలో నటించేందుకు మైక్ టైసన్ అంగీకరించినట్లు పూరి ట్వీట్ చేసి వెల్లడించారు. యాక్షన్ ఓరియంటేషన్ ప్రధాన ఇతివృత్తంగా విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ అనౌన్స్ చేసిన ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందన్న అంచనాలు కొనసాగుతున్న నేపధ్యంలో పూరి జగన్నాథ్ కొద్దిసేపటి క్రితం షాకింగ్ న్యూస్ ట్వీట్ చేశారు.

అమెరికా బాక్సింగ్ యోథుడు తెలుగు వెండితెర సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు పూరి వెల్లడించారు. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ పోరాట యోధుడు (మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్)గా నటిస్తున్నట్లు ఇప్పటికే పోస్టర్లు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేను విజయ్ దేవరకొండకు జోడీగా ఎంపిక చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయతే తాజాగా భారతీయ వెండితరపై.. అందునా తెలుగు వెండితెరపై మైక్ టైసన్ నటించడం ఇదే తొలిసారి.