గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

 గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల టౌన్, వెలుగు: గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ అన్నారు. శుక్రవారం జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌లో గిరిజన గ్రామాల అభివృద్ధిపై ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ అలుగు వర్షిణితో కలిసి రివ్యూ మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన పంచాయతీల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు వివరించారు.

ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన అభివృద్ధికి రూ. 81.00 కోట్లు మంజూరయ్యాయని, అంశాల వారీగా నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. మండలాల వారీగా విద్య, వైద్యం, కరెంట్‌‌‌‌, రోడ్లు, డ్రైనేజ్.. వాటిని అభివృద్ధి చేస్తామని వివరించారు. మీటింగ్‌‌‌‌లో కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ బీఎస్‌‌‌‌ లత, అధికారులు పాల్గొన్నారు.