కోటి 50 లక్షల టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధం: గంగుల

కోటి 50 లక్షల టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధం: గంగుల

ఖరీఫ్ సీజన్లో వడ్ల సేకరణకు 7100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా 1545 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనట్లు వెల్లడించారు. వీటి ద్వారా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఖరీఫ్లో కోటీ 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు  తెలిపారు. కోటి యాభై లక్షల టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. 

ప్రస్తుతం ప్రపంచంలో ఆహార కొరత ఉందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణలో పండే ధాన్యమే ఇప్పుడు చాలా ప్రాంతాలకు అన్నం పెడుతోందని తెలిపారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో 25 కోట్ల గన్ని బ్యాగులు అవసరమన్నారు. ప్రస్తుతానికి 12 కోట్ల గన్ని బ్యాగ్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రాజకీయ నాయకులు ఎవరు కల్లాల్లోకి వెళ్లి రైతులను ఇబ్బంది పెట్టొదని కోరారు. ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం చేయవద్దన్నారు.