
కుంటాల/జైపూర్, వెలుగు: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 16న ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. భూభారతి చట్టం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన మంచిర్యాల జిల్లా భీమారం మండలం, నిర్మల్ జిల్లా కుంటాలలో పర్యటించనున్నారు. కుంటాలలో ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు.
రైతులతో నిర్వహించే బహిరంగ సభ, భూభారతి దరఖాస్తులు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలపై సూచనలు చేశారు. భీమారం మండలంలోని పోతనపల్లిలో మంత్రి పర్యటిస్తారని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ సదానందంతో కలిసి గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. మండలంలో భూసమస్యల సంబంధిత దరఖాస్తులను స్వీకరించి, పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారని తెలిపారు.