రాజ్యంగాన్ని కాపాడుకోవాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

రాజ్యంగాన్ని కాపాడుకోవాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
  • ​​​మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: భవిష్యత్​లో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శనివారం హుస్నాబాద్ లో కార్యకర్తలతో కలిసి క్విట్ ఇండియా దినోత్సవంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యాన్ని సాధించడానికి  గాంధీ పిలుపునిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమం గడిచి నేటికీ 83 ఏళ్లు అయిందని గుర్తు చేశారు. సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని ఈరోజు కాపాడుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. 

రాజ్యాంగాన్ని రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారన్నారు. ప్రస్తుతం రాజకీయాలు కలుషితం చేసే విధంగా వ్యవస్థ నడుస్తుందన్నారు. దానిని అధిగమించడానికి యువజన కాంగ్రెస్​ శ్రమ పడాలన్నారు. కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్​ లింగమూర్తి, సింగిల్​విండో చైర్మన్ శివ్వయ్య, ఏఎం​సీ చైర్మన్​తిరుపతిరెడ్డి ఉన్నారు.