
- మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్, వెలుగు: మక్తల్ నియోజకవర్గంలోని చెరువులు అలుగు పారితే ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగే చోట శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మండలంలోని కర్ని గ్రామ చెరువు అలుగు పారుతుండటంతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువుల అలుగు పారుతుండటంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్యలకు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
మండల పరిధిలోని గోలపల్లి, రుద్రసముద్రం, కర్ని, ముస్లాయిపల్లి చెరువుల అలుగులు పారి వరద వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. పట్టణ సమీపంలో నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రి పనులను పరిశీలించారు.
రైతులకు న్యాయం చేస్తాం
ఊట్కూర్, వెలుగు : నారాయణపేట మక్తల్ కొడంగల్ ఎత్తిపోతల పథకం 69 జీవోలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మక్తల్ లోని ఆయన నివాసంలో మండల శివారు రైతులు కలిశారు. ఎకరాకు రూ.30 లక్షలతో పాటు భూములు, ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని మంత్రిని కోరారు. త్వరలోనే ఇన్చార్జి మంత్రిని కలిసి మీటింగ్ ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యజ్ఞేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్యప్రకాశ్ రెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బాల్రెడ్డి ఉన్నారు.