వీణవంక, వెలుగు: కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో జరిగిన ఓ పెళ్లిలో కొత్త జంటను మంత్రి వివేక్ వెంకటస్వామి ఆశీర్వదించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దె రాగడికి చెందిన గుర్రం మాధవి-–భీమలింగు కొడుకు అనిల్ కుమార్ పెండ్లి బుధవారం వీణవంకలో జరిగింది.
ఈ వేడుకకు హాజరైన మంత్రి వివేక్ కొత్త దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వీణవంక మండల నాయకులు, జమ్మికుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాదాసి సునీల్ ఆయనను మర్యాదపూర్వకంగా
కలిసి సత్కరించారు.

