మిర్యాలగూడలో లారీ యూరియా మాయం ?

మిర్యాలగూడలో లారీ యూరియా మాయం ?
  • విచారణ జరుపుతున్న ఆఫీసర్లు

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లారీ యూరియా మాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. యూరియా స్టాక్‌ వివరాలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే ఇటీవల ఆఫీసర్లకు ఫోన్‌ చేయగా  లోడ్‌ యూరియా పక్కదారి పట్టిన విషయం బయటపడింది. సదరు ఎమ్మెల్యే వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న నాగునాయక్‌ ఇటీవల మార్క్‌ఫెడ్‌ డీఎంకు ఫోన్‌ చేసి.. తాను ఎమ్మెల్యే గన్‌మెన్‌గా పరిచయం చేసుకొని.. లోడ్‌ యూరియా పంపాలని కోరినట్లు తెలుస్తోంది. 

వారు యూరియా పంపగా... దానిని సదరు గన్‌మెన్‌ పక్కదారి పట్టించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఇటు ఎమ్మెల్యేకు, అటు పోలీస్‌ ఉన్నతాధికారులకు తెలియడంతో ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ శ్రవణ్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం జ్యోతి, మాడుగులపల్లి మండల ఏవోను వివరణ కోరగా పొంతన లేని సమాధానాలు చెప్పడం గమనార్హం.