ఆకాల వర్షాలకు తడిసిన వడ్లను కొంటాం : అడ్లూరి లక్ష్మణ్​కుమార్​

ఆకాల వర్షాలకు తడిసిన వడ్లను కొంటాం : అడ్లూరి లక్ష్మణ్​కుమార్​

జగిత్యాల, వెలుగు: ఆకాల వర్షాలకు తడిసిన వడ్లను కొంటామని, రైతులు ఆందోళనకు గురికావద్దని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌లో వడ్ల కొనుగోళ్లపై మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 428 కొనుగోలు కేంద్రాల ద్వారా 65,554 మంది రైతుల నుంచి 3.88 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశామన్నారు. వీటికి సంబంధించి 54,132 మంది రైతుల ఖాతాల్లో రూ.723.46 కోట్లు జమయ్యాయన్నారు. అకాల వర్షం కారణంగా మొలక వచ్చినా, తేమ శాతం ఉన్నా వడ్లు కూడా కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. 

గొల్లపల్లి, వెలుగు : గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలోని భక్తాంజనేయ స్వామి ఆలయ 16 వ వార్షికోత్సవం సందర్భంగా విప్‌‌‌‌ అడ్లూరి, మాజీ ఎమ్మెల్సీ జీవనరెడ్డి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఈక్రమంలో పలువురు స్థానికులు హనుమాన్ ఆలయానికి సీసీ రోడ్డు లేక అవస్థలు పడుతున్నామని విప్​దృష్టికి తీసుకురాగా.. రూ.15లక్షలు మంజూరు చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌‌‌‌ భీమా సంతోష్,  వైస్ చైర్మన్ రాజిరెడ్డి, లీడర్లు పాల్గొన్నారు.