
- మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
నవాబ్ పేట్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి అసమర్ధుడని తాను ఇచ్చిన బిరుదని, అందుకు తగిన ఆధారాలు చూపుతానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం అన్నారు. ముడా ద్వారా జడ్చర్లకు రావాల్సిన నిధులను మహబూబ్ నగర్ కు వాడుకోవడానికి చేసిన తీర్మానంపై లక్ష్మారెడ్డి సంతకం చేసిన కాపీని నవాబుపేట సభలో ఎమ్మెల్యే ప్రజలకు చూపించారు. మంగళవారం నవాబుపేటలో ఏర్పాటు చేసిaన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చేసిన తీర్మానాలను ప్రజల ముందు ఉంచుతున్నానని అన్నారు. ముడాకు గతంలో వచ్చిన రూ.30 కోట్ల ఆదాయాన్ని జడ్చర్ల ప్రాంతంలో ఖర్చు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి ఉండగా, మాజీ ఎమ్మెల్యే అప్పట్లో మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ మాటలకు తలొగ్గి ఆ నిధులను మొత్తం మహబూబ్ నగర్ పట్టణంలో అభివృద్ధి పనులు చేయడానికి చేసిన తీర్మానాలపై సంతకాలు చేశారని మండిపడ్డారు.
లీడర్బన్గయా ఫార్మర్
మహబూబ్‌నగర్ : జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తన మార్క్ ను కొనసాగిస్తున్నాడు. మంగళవారం నవాబుపేట మండలం చౌడూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ రైతు తన వరి చేనులో యూరియా చల్లుతుండగా.. వెంటనే అనిరుధ్‌రెడ్డి ఆయన వద్దకు వెళ్లాడు. రైతు నుంచి యూరియాను తీసుకొని ఎమ్మెల్యే చేనులో చల్లాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంటల పరిస్థితి, యూరియా లభ్యత, మార్కెట్ సౌకర్యాలు, భూగర్భ జలాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.