అన్ని హంగులతో ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేయాలి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అన్ని హంగులతో ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేయాలి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

చండ్రుగొండ, వెలుగు : ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బెండాలపాడు గ్రామంలో ప్రారంభించే ఇందిరమ్మ ఇండ్ల ను అన్ని  హంగులతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హౌసింగ్ శాఖ ఆఫీసర్లను ఆదేశించారు. ఆదివారం బెండాలపాడులో ఆయన పర్యటించారు. గ్రామంలో పారిశుధ్య పనులు, రోడ్ల రిపేర్లు,  కల్వర్టు లకు రంగులు, కరెంట్ లాంటి పనులను స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు.

  సమస్యలు లేని  గ్రామంగా బెండాలపాడు తీర్చాదిద్దాలని ఆఫీసర్ల సూచించారు. అనంతరం అయ్యన్నపాలెంలో   హెలీప్యాడ్, దామరచర్లలో సభాస్థలం పనులు పరిశీలించారు. ఎమ్మెల్యే హౌసింగ్ ఏఈ రాము, నాయకులు భోజ్యానాయక్, బొర్రాసురేశ్, తదితరులు ఉన్నారు.

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

అన్నపురెడ్డిపల్లి : ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అశ్వారావుపేట ఎమ్మెల్యే  జారే ఆదినారాయణ అన్నారు. ఆదివారం  అన్నపరెడ్డిపల్లి  గ్రామంలో  పంచాయితీ కార్యాలయంలో రూ.6,45,500 సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను 20 మంది లబ్ధిదారులకు ఆయన అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య మధ్య తరగతి ప్రజలకు వైద్య ఖర్చులకు సీఎంఆర్​ఎఫ్​ రూపంలో రూ.కోట్ల పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వనమా గాంధీ, పర్సా వెంకటేశ్వరావు, కట్ట శివ, పోట్రు వెంకటేశ్వరావు, రాము, నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.