కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో చర్చించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తో సమావేశమయ్యారు. ఫారెస్ట్, ఎడ్యుకేషన్, హెల్త్, మున్సిపాలిటీ, డీఆర్డీవో, ఎక్సైజ్, పంచాయతీ రాజ్ శాఖలకు సంబంధించి ప్రగతి పనులపై చర్చించారు. అడిషనల్ కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
