సాంస్కృతిక పాలసీని ప్రకటించాలి

సాంస్కృతిక పాలసీని ప్రకటించాలి
  • ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు
  • హాజరైన ఎమ్మెల్యే కూనంనేని, ఎమ్మెల్సీ కోదండరాం

బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణ సమగ్ర సాంస్కృతిక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని కవులు, కళాకారులు కోరారు. ఇదే డిమాండ్​తో సోమవారం బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి కవులు, కళాకారుల సదస్సుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. సమాజం మరింత వెలుగు రేఖల వైపు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ప్రజానాట్యమండలి పని చేయాలని కూనంనేని కోరారు. భావ వ్యాప్తిలో సాంస్కృతిక రంగానిదే కీలక పాత్ర అని కోదండరాం అన్నారు. ప్రజలను జాగృతం చేయడంలో ప్రజానాట్య మండలి మరింత కీలకంగా పనిచేయాలన్నారు.