
- ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి
హాలియా, వెలుగు: గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హాలియాలోని తన క్యాంప్ ఆఫీస్‌లో గీత కార్మికులకు కాటమయ్య కిట్లు అందజేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కాకునూరి నారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాల్సాని చంద్రశేఖర్, పార్టీ మండల అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి, టౌన్ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్, నాయకులు రమేశ్‌యాదవ్, భాస్కర్ నాయక్, ఆంజనేయులు, వల్లభ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.