రామగుండం అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్

రామగుండం అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: రామగుండం ప్రాంతం విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. శుక్రవారం రూ.6.16 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వివిధ ఏరియాల్లో చేపట్టనున్న అండర్‌‌ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌, ఫ్రూట్​మార్కెట్‌కు గాంధీ నగర్ గోశాల వెనుక ఖాళీ స్థలంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలో సుమారు రూ.230 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ రూపుదిద్దుకోబోతుందని తెలిపారు. రామగుండం ఐటీఐని అడ్వాన్స్​డ్​ ట్రైనింగ్ సెంటర్‌‌గా అప్ గ్రేడ్ చేసి అత్యాధునిక కోర్సులను ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. జనరల్​హాస్పిటల్‌లో రూ.200 కోట్లతో కొత్త భవనాలు నిర్మాణమవుతున్నాయని అన్నారు.

ఇలా పారిశ్రామికప్రాంతాన్ని విద్య, వైద్య రంగంలో ముందుంచడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​ జె.అరుణశ్రీ, ఎస్ఈ శివానంద్​, ఈఈ రామన్​, లీడర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్‌, కొలిపాక సుజాత, ముస్తఫా, తేజస్విని, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.