- ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి
బాన్సువాడ, వెలుగు : పేదల సొంతింటి కల నిజం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చిందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించి లబ్ధిదారులు పిట్ల రుక్మిణి, రఘుపతి , గుల సాయవ్వ, సాయిలుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అనంతరం బోర్లం గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీ, ఎల్లమ్మ కాలనీ, ఎస్సీ కాలనీల్లో రూ.70 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
57 మందికి ఇండ్ల బిల్లులు పంపిణీ
పోతంగల్, కోటగిరి, రుద్రూర్, వర్ని మండలాలకు చెందిన 57 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి తన నివాసంలో ఇండ్ల బిల్లులు పంపిణీ చేశారు. వర్ని మండలం పాత వర్ని, జలాల్ పూర్, జకోరా, ఎస్ఎన్ పురం గ్రామాలకు చెందిన 24 మంది డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ.82లక్షల41వేల 056-, పోతంగల్ సుంకిని గ్రామానికి చెందిన 20 మందికి రూ.56 లక్షల 44వేల 800, కోటగిరి మండలం ఎక్లాస్పూర్ క్యాంప్ గ్రామానికి చెందిన ఐదుగురికి రూ.16లక్షల12వేల 800, రుద్రూర్ మండలం రాణంపల్లికి చెందిన ఎనిమిది మందికి రూ.24లక్షల18వేల474 విలువ గల బిల్లులను అందజేశారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
