తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్

తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. 29వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. మాజీ మంత్రి కడియం శ్రీహరి ఎమ్మల్సీగా ఉండి.. స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన మండలికి రాజీనామా చేశారు. మరో సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉండి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన కూడా పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 

 

  • నామినేషన్ల స్వీకరణ        జనవరి 11,2024
  • నామినేషన్లకు చివరి తేదీ    జనవరి 18
  • స్క్రూట్నీ తేదీ        జనవరి 19
  • ఉపసంహరణలు        జనవరి 22
  • పోలింగ్ తేదీ        జనవరి 29 (ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు)
  • ఓట్ల లెక్కింపు        జనవరి 29,( సాయంత్రం 5 గంటలకు)
  • ఎన్నికల ప్రక్రియ ముగింపు    ఫిబ్రవరి 1
  • ALSO READ | గేట్ 2024 అడ్మిట్ కార్డు ఎప్పుడు విడుదల అవుతుందంటే..