గేట్ 2024 అడ్మిట్ కార్డు ఎప్పుడు విడుదల అవుతుందంటే..

గేట్ 2024 అడ్మిట్ కార్డు ఎప్పుడు విడుదల అవుతుందంటే..

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ లేదా గేట్ 2024 కోసం అడ్మిట్ కార్డులు( హాల్ టిక్కెట్ ) లను త్వరలో విడుదల చేయనున్నట్లు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగుళూరు  ప్రకటించింది. జనవరి 3 న గేట్ అడ్మిట్ కార్డులను విడుదల కావాల్సి ఉండగా.. జాప్యం జరిగిందని.. త్వరలో అడ్మిట్ కార్డుల విడుదల చేస్తామని చెప్పారు. గతేడాది కూడా జనవరి 3న అడ్మిట్ కార్డు విడుదల కావాల్సి ఉండగా.. సాంకేతిక లోపాల కారణంగా జనవరి 9న అడ్మిట్ కార్డు విడుదలైంది. 

గేట్ 2024 పరీక్ష ఎప్పుడు జరుగుతుంది ? 

గేట్ 2024 ఫిబ్రవరి 3 నుంచి 11 వరకు రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది. మొదటి షిఫ్టు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యామ్నం 12.30 గంటల వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో దేశవ్యాప్తంగా 200 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ప్రశ్న పత్రాన్ని పూర్తి చేయడానికి దఅభ్యర్థికి మూడు గంటల సమయం ఉంటుంది. MSZ లేదా NAT ప్రశ్నలకు తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు. 

గేట్ 2024 అడ్మిట్ కార్డును  డౌన్ లోడ్ చేయడం ఎలా ? 

  • అడ్మిట్ కార్డు విడుదల ప్రకటన తర్వాత  అధికారిక వెబ్ సైట్ gate2024.oosc.ac.om ను సందర్శించాలి.
  • గేట్ 2024 అడ్మిట్ కార్డు అని ఉన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి. 
  • లాగిన్ విండో ఓపెన్ అవుతుంది 
  • రిజిస్ట్రేషన్ నంబర్, పెట్టిన తేది, ఇతర వివరాలు వంటి మీకు అవసరమైన వివరాలను నమోదు చేయాలి. 
  • గేట్ 2024 అడ్మిట్ కార్డ్ స్క్రీన్ పై కనిపిస్తుంది
  •  GATE2024 అడ్మిట్ కార్డుని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. భవిష్యత్ కోసం దీనిని మీ సేవ్ చేసుకోవాలి  

గేట్ 2024 అడ్మిట్ కార్డులో ఏ వివరాలు ఉంటాయి?

అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లపై ఈ క్రింది వివరాలను చెక్ చేసుకోవాలి 

  • పరీక్ష కేంద్రాలు 
  • నగరాలు 
  • పేపర్ టైమింగ్
  • రిపోర్టింగ్  సమయం 
  • పరీక్ష రోజు మార్గదర్శకాలు 
  • పరీక్ష రోజున ఏ పత్రాలు అవసరం ? 

అభ్యర్థుులు పరీక్ష రోజు తప్పనిసరిగా ప్రింటెడ్ అడ్మిట్ కార్డు, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. అడ్మిట్ కార్డుపై ఫొటో, సంతకం స్పష్టంగా ఉండాలి.