రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి : ఎంపీ డీకే అరుణ

రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి : ఎంపీ డీకే అరుణ
  • ఎంపీ డీకే అరుణ 

 దేవరకొండ, వెలుగు: మొంథా తుఫాన్ దాటికి వరద ముంపునకు గురై నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  శనివారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల పరిధిలోని దొన్యాల గ్రామంలో  నష్టపోయిన పంట పొలాలను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. బాధిత కౌలు రైతు ఈదయ్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనను రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చిందని రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ మండిపడ్డారు. 

వర్ష ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించడానికి ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి రాలేదన్నారు.  ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం యంత్రాంగం పంట పొలాలను పరిశీలించి పంట నష్టం అంచనా వేయాలన్నారు. రైతులను గుర్తించి నష్టపరిహారం అందజేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. చింతపల్లి సాయిబాబా దేవాలయంలో సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో  నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కేతావత్ లాలునాయక్, నక్క వెంకటేశ్వర్లు, ఏటి కృష్ణ, అసెంబ్లీ కన్వీనర్ నరేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి జంగిటి మల్లేష్, జనార్ధన్, వెంకటయ్య, యాదయ్య, సుధాకర్ రైతులు పాల్గొన్నారు.