80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం పంపిణీ

80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం పంపిణీ

సీఎం కేసీఆర్ అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేశారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నాం, ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నామంటూ జనాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో లక్ష్మణ్ పర్యటించారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని వీబీ నగర్లో బీజేపీ ఓబీసీ మోర్చా, NSR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మెడికల్ క్యాంపును ప్రారంభించారు. అక్టోబరు 2వ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకుని బీజేపీ కార్యకర్తలు చేనేత వస్త్రాలను పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. 

80 కోట్ల మందికి బియ్యం..

కరోనా సమయంలో తెలంగాణలో రూ. లక్ష కట్టలేక చాలా మంది పేద ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. కరోనా సమయంలో ప్రజలెవ్వరూ తిండి లేక ఇబ్బంది పడొద్దని.. ప్రధాని మోడీ 80 కోట్ల మందికి ఉచితంగా  బియ్యం పంపిణీ చేశారని చెప్పారు. కేంద్రం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తే..కేసీఆర్ మాత్రం తాము ఇచ్చినట్లుగా చెప్పుకున్నారని మండిపడ్డారు.