పొన్నం సత్తయ్య గౌడ్‌‌‌‌కు ఎంపీ వంశీకృష్ణ నివాళి

పొన్నం సత్తయ్య గౌడ్‌‌‌‌కు  ఎంపీ వంశీకృష్ణ నివాళి

కరీంనగర్, వెలుగు: మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి దివంగత పొన్నం సత్తయ్య గౌడ్ విగ్రహానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శుక్రవారం నివాళులర్పించారు. సత్తయ్య గౌడ్ 15వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని  పొన్నం సత్తయ్య గౌడ్  ఘాట్ వద్ద నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌తోపాటు ఆయన సోదరులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్ర గౌడ్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్‌‌‌‌‌‌‌‌రావు, ముఖ్య నాయకులు నివాళులర్పించారు. 

ఎమ్మెల్యే కవ్వంపల్లికి పరామర్శ 

మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ​ సోదరుడు కవ్వంపల్లి రాజేశం ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కవ్వంపల్లిని ఎంపీ వంశీకృష్ణ శుక్రవారం పరామర్శించారు.  
మంథని, వెలుగు: మంథని మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన దాసరి చంద్రమౌళి ఇటీవల చనిపోగా.. వారి కుటుంబసభ్యులను ఎంపీ గడ్డం వంశీ పరామర్శించారు. చంద్రమౌళి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.