
బ్యాంకింగ్ సవరణ చట్టం 2025లోని కొన్ని కొత్త రూల్స్ ఈ ఏడాది నవంబర్ 1 నుండి అమలులోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దింతో వచ్చే నెల నుండి బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్, బ్యాంకు అధీనంలో పెట్టిన వస్తువులు, సేఫ్టీ లాకర్లలోని వస్తువుల పై ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి.
ఈ రూల్స్ ఏమిటంటే: బ్యాంక్ కస్టమర్లు ఇక పై నలుగురుని నామినీలుగా పెట్టుకోవచ్చు. అలాగే బ్యాంక్ కస్టమర్లు నలుగురు నామినీలకు ఎంత వాటా (శాతం) ఇవ్వాలో కూడా స్పష్టంగా పేర్కొనవచ్చు, అంటే మొత్తం 100% ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల పంపకంలో చిక్కులు/ సమస్యలు లేకుండా ఉంటుంది. ఇంకా క్యాష్ డిపాజిట్ అకౌంట్లకు మీరు ఒకేసారి లేదా ఒకరు తరువాత మరొకరు ఇలా నలుగురిని నామినిగా సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు.
బ్యాంక్ కస్టడీలో ఉంచిన వస్తువులు, లాకర్ల కోసం మాత్రం మీ తరువాత నామినీ, నామిని చనిపోతే అప్పుడు సెకండరీ నామినిని ఇలా నాలుగురు నామీలను మాత్రమే అనుమతిస్తారు. ఈ కొత్త రూల్స్ వల్ల బ్యాంక్ కస్టమర్లు నచ్చిన విధంగా నామినిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, నామినీలకు క్లెయిమ్ (డబ్బు/వస్తువులు) వేగంగా, చిక్కులు లేకుండా పరిష్కారం అవుతుంది. ఇంకా నామిని మరణించిన తర్వాత వారసత్వ ఆస్తుల పరిష్కారంలో స్పష్టతను ఇస్తుంది.
ఈ నిబంధనలు అన్ని బ్యాంకులలో ఒకేలా అమలు చేయడానికి, త్వరలో బ్యాంకింగ్ నామినేషన్ నియమాలు 2025 విడుదల కానుంది. ఈ చట్టం బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడం, కస్టమర్లు అలాగే పెట్టుబడిదారుల రక్షణ పెంచడం ఇంకా కస్టమర్‌లకు ఇంకా మెరుగైన నామిని సౌకర్యాలు ఇవ్వడం కోసం తీసుకొచ్చారు.