
బుర్రలు లేకపోయినా తెలివిలు మాత్రం ఎక్కువయ్యాయి.. సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసి మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు. స్పెషల్ 26 అనే హిందీ సినిమా తరహాలో.. అప్పట్లో తెలుగులో వచ్చిన హీరో సూర్య సినిమా అయిన గ్యాంగ్ మూవీ తరహాలో రిటైర్డ్ ఉన్నతాధికారి ఇంటికి వెళ్లి.. కూల్ గా 36 లక్షలు కొట్టేసిన ముఠా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ మూవీ తరహా స్కామ్‌లో, ఆరుగురు దొంగల ముఠా పోలీసు అధికారులుగా నటించి సోదాల పేరుతో రిటైర్డ్ పీడబ్ల్యూడీ అధికారి నివాసంలో రూ.36 లక్షల విలువైన డబ్బు, విలువైన వస్తువులను కాజేశారు. ఈ దొంగలు.. అవినీతి నిరోధక బ్యూరో అధికారులుగా నటిస్తూ కాంతిలాల్ యాదవ్ ఇంటిని సెర్చ్ చేశారు. ఆయన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో రిటైర్డ్ అధికారిగా పని చేస్తున్నారు. గత వారం బాధితులు దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు, ముంబై పోలీసుల 'అవినీతి నిరోధక బ్యూరో' అధికారులుగా చెప్పుకునే ఈ ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
దొంగలు మొదటగా యాదవ్, అతని భార్య మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో సోదాలు జరిగే వరకు వారిని తమ ఓ పక్కన కూర్చోబెట్టారు. వారు ఆదేశించిన మేరకు అల్మారా తాళాలు ఇవ్వమని యాదవ్ తన భార్యకు చెప్పాడు. అయితే గడ్డం ఉన్న వ్యక్తిని చూడాలని యాదవ్ పట్టుబట్టినా రెండో వ్యక్తి నిరాకరించాడు. సోదాలు పూర్తయిన తర్వాత చూపిస్తామని చెప్పారు. యాదవ్, అతని భార్యను తమ గ్యాంగ్ నాయకుడితో కూర్చోమని ఆదేశించగా, మిగిలిన ఐదుగురు సహచరులు మూడు పడకగదుల ఫ్లాట్‌లోని అన్ని అల్మారాల్లో తనిఖీలు చేశారు.
ఈ నకిలీ సోదాల్లో ఆరుగురు సభ్యులు రూ.25 లక్షల 25వేల నగదు, రూ.3లక్షల 80వేల విలువైన బంగారు గొలుసు, రూ.4లక్షల 20 వేల విలువైన ఉంగరం, బ్రాస్‌లెట్, రూ.40 వేల విలువైన డైమండ్ రింగ్, రూ. 80వేల విలువైన బంగారు మంగళ సూత్రం, కనీసం రూ. 10వేల విలువ చేసే రెండు చేతి గడియారాలు ఉన్నట్టు సమాచారం. అంతే కాకుండా ఓ అల్మారాలో దొరికిన లెదర్ బ్యాగ్‌లో ఈ విలువైన వస్తువులను నింపి ముఠా సభ్యులు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.