ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు సచిన్ సలహాలు

ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు సచిన్ సలహాలు

ముంబై: ఐపీఎల్‌‌‌‌లో ముంబై ఇండియన్స్‌‌కు మెంటర్‌‌గా ఉన్న క్రికెట్‌‌ లెజెండ్‌‌ సచిన్‌‌ టెండూల్కర్‌‌ ఆ టీమ్‌‌ మ్యాచ్‌‌ల్లో డగౌట్‌‌లో కూర్చుంటాడు. బ్రేక్‌‌, టైమౌట్స్‌‌లో ప్లేయర్లకు అవసరమైన సూచనలు ఇస్తూ కనిపిస్తాడు.  కానీ, ఆదివారం వాంఖడేలో కేకేఆర్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో సచిన్‌‌ డగౌట్‌‌లో కాకుండా డ్రెస్సింగ్ రూమ్‌‌లో ఉన్నాడు. గ్రౌండ్‌‌లో ఉన్న ఓ వ్యక్తికి తాను కనబడకుండా చూసుకున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు సచిన్‌‌ కొడుకు అర్జున్ టెండూల్కరే.

ఆ మ్యాచ్‌‌తో అర్జున్‌‌ ఐపీఎల్‌‌లో అడుగు పెట్టాడు. అయితే, డగౌట్‌‌లో తనను చూసి అర్జున్‌‌ కంగారు పడవద్దన్న ఉద్దేశంతో డ్రెస్సింగ్​ రూమ్​లో ఉండిపోయమానని సచిన్​ చెప్పాడు. ‘ఇది నాకు కొత్త అనుభవం. ఎందుకంటే ఇప్పటి వరకు నేను గ్రౌండ్‌‌కు వెళ్లి అర్జున్‌‌ ఆటను చూడలేదు. ఈ మ్యాచ్‌‌లో అర్జున్‌‌ స్వేచ్ఛగా ఆడాలని అనుకున్నా. అందుకే  నేను డ్రెస్సింగ్ రూమ్‌‌లో కూర్చున్నా. నన్ను చూసి అర్జున్ తన ప్లాన్స్‌‌ను మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను లోపలే ఉన్నా’ అని సచిన్‌‌ చెప్పుకొచ్చాడు.  ఆటను గౌరవిస్తేనే అది మనకు కావాల్సింది ఇస్తుందని  అర్జున్​కు సలహా ఇచ్చాడు.