ఎమ్మెల్యే పేరుతో ప్రభుత్వ భూముల కబ్జా..జడ్పీ మాజీ చైర్ పర్సన్ సుహసిని రెడ్డి

ఎమ్మెల్యే పేరుతో ప్రభుత్వ భూముల కబ్జా..జడ్పీ మాజీ చైర్ పర్సన్ సుహసిని రెడ్డి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు:  ఆదిలాబాద్ జోగు రామన్న కాలనీలో ప్రభుత్వ భూమి కబ్జా ను బయట పెట్టిన బీజేపీ లీడర్​ గండ్రత్​ మహేందర్ ను బెదిరించడం సరికాదని జడ్పీ చైర్మన్​, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహసిని రెడ్డి అన్నారు.  జోగు రామన్న కాలనీని మంగళవారం ఆమె లీడర్లతో కలిసి సందర్శించి మాట్లాడారు. మున్సిపల్​ వైస్​ చైర్మన్ ​మున్సిపాలిటీకి గండ్రత్​ మహేందర్ ను  రావొద్దని బెదిరించడం సమంజసం కాదన్నారు.  ప్రజలు అధికారం ఇచ్చింది ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికా అని ప్రశ్నించారు.  కబ్జా చేసిన స్థలాలకు ఎమ్మెల్యే పేరు పెట్టడం ఏంటన్నారు.  బీజేపీ లీడర్ల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.  ఆదిలాబాద్​ఎమ్మెల్యే జోగు రామన్న కుమారుడు మున్సిపల్​ చైర్మన్​ జోగు ప్రేమేందర్​ల బినామీ  వైస్​ చైర్మన్ జహీర్​రంజానీ అన్నారు. వాళ్ల పేరుతో జహీర్​రంజానీ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నాడని ఆరోపించారు.  ఆమె వెంట పార్టీ లీడర్లు ఉన్నారు.