ఆంగ్ సాన్ సూకీపై మయన్మార్ సైన్యం అవినీతి కేసు

V6 Velugu Posted on Jun 10, 2021

మయన్మార్ ప్రజా నేత ఆంగ్ సాన్ సూకీపై ఆ దేశ సైనిక పాలకులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆమెపై అవినీతి కేసు పెట్టారు. అక్రమ మార్గాల్లో బంగారం, 5 లక్షల డాలర్లకుపైగా సొమ్మను లంచంగా తీసుకున్నారని సైనిక ప్రభుత్వం ఆరోపించింది. ఫిబ్రవరి 1న ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసిన ఆ దేశ సైన్యం పాలనను అధీనంలోకి తీసుకుంది. ఇక అప్పటి నంచి మయన్మార్ లో ఆందోళనలు సాగుతున్నాయి. జుంటా కాల్పుల్లో 850 మందికిపైగా పౌరులు మరణించారు.

ఆర్మీ అదుపులోనే ఉన్న సూకీపై ఎన్నెన్నో నేరాలను సైన్యం మోపింది. దేశద్రోహం, బ్రిటీష్ కాలం నాటి రహస్య చట్టాల ఉల్లంఘన వంటి ఆరోపణలను మోపింది. ఇప్పుడు 6 లక్షల డాలర్లు, 11 కిలోల బంగారాన్ని సూకీ అక్రమంగా పొందారని యాంగోన్ రీజియన్ చీఫ్ మినిస్టర్ అన్నారు. అవినీతి నిరోధక కమిషన్ అందుకు తగిన సాక్ష్యాధారాలు సేకరించిందన్నారు.

పదవిని అడ్డంపెట్టుకుని ఆమె ఎన్నెన్నో అక్రమాలకు పాల్పడిందన్నారు. కాబట్టి అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 55 ప్రకారం ఆమెపై కేసు నమోదు చేశామన్నారు. తమ  స్వచ్ఛంద సంస్థ కోసం ఇంటిని అద్దెకు తీసుకునే సమయంలోనూ అధికారులను సూకీ బెదిరించారన్నారు.అయితే.. ఆ ఆరోపణలను సూకీ లాయర్ ఖిన్ మౌంగ్ జా ఖండించారు.

Tagged Myanmar military, junta charges, Aung San Suu Kyi, corruption

Latest Videos

Subscribe Now

More News