రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : కుందూరు జైవీర్రెడ్డి

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : కుందూరు జైవీర్రెడ్డి
  • సాగర్​ఎమ్మెల్యే కుందూరు జైవీర్​రెడ్డి

హాలియా, వెలుగు: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నాగార్జునసాగర్​ఎమ్మెల్యే కుందూరు జైవీర్​రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కామారెడ్డి గూడెం గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ ఆఫీసు, అంగన్వాడీ కేంద్రాన్ని, నిడమనూరు మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కుందూరు జైవీర్​రెడ్డి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు  సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని ఆయన కోరారు. తహసీల్దార్ ప్రమీల, నిడమనూరు మార్కెట్​కొత్తపల్లి చైర్మన్​అంకతి సత్యం, త్రిపురారం ఎంపీడీఓ విజయ, నిడమనూరు పీఎస్ఎస్ చైర్మన్ విరిగినేని ఆదినారాయణ, నాయకులు అనుముల శ్రీనివాస్​ రెడ్డి, మిడిమాల బుచ్చిరెడ్డి, మర్ల చంద్రారెడ్డి పాల్గొన్నారు.