వ్యక్తిగత శుభ్రతతో వ్యాధులను అరికట్టవచ్చు : ఇలా త్రిపాఠి

వ్యక్తిగత శుభ్రతతో వ్యాధులను అరికట్టవచ్చు : ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : వ్యక్తిగత శుభ్రతతో వ్యాధులను అరికట్టవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం నల్గొండలోని ఏఆర్ నగర్ లో ఆమె పర్యటించారు. వార్డులో పరిసరాలతోపాటు మురుగు కాల్వలు, ఇండ్లను పరిశీలించారు. వార్డులో పరిశుభ్రత లోపించడాన్ని గమనించిన కలెక్టర్.. ఓపెన్ డ్రైనేజీ సిస్టం మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ను ఆదేశించారు. వార్డులో నిర్వహిస్తున్న జ్వర సర్వే సిబ్బందితో మాట్లాడారు. 

ఇప్పటివరకు నమోదైన జ్వర కేసులు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లైన్ వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. వెంకటేశ్వర ఆగ్రో ఏజెన్సీ ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు.  అనంతరం కలెక్టరేట్​లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారుకులం, మతం పేరుతో అవమానించలేదుతను ఎవరినీ కులం, మతం పేరుతో అవమానించలేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. 

సోమవారం ప్రజావాణి లో భాగంగా ఇజ్రాయిల్ యుద్ధ సంఘటనకు సంబంధించి జిల్లాలోని కొంతమంది ఉలేమాలు తనకు దరఖాస్తు సమర్పించారని తెలిపారు. ఈ సందర్భంలోనే హైదరాబాద్ కు చెందిన ముస్లిమేతర మహిళ దేవి తన(కలెక్టర్)ను నువ్వు.. నువ్వు అని సంబోధించడమే కాకుండా జిల్లా అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వివరించారు. అయినప్పటికీ ఆమెకు సముచితంగా సమాధానం చెప్పి ప్రజావాణి నుంచి పంపించామని పేర్కొన్నారు. ఎవరినీ ఎన్నడూ తను అవమానించలేదని, అందరితో మర్యాదపూర్వకంగానే మాట్లాడుతానని తెలిపారు.