అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

 అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు :  కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి

మిర్యాలగూడ, వెలుగు: మూడు నెలలకు మించి వలస వెళ్లిన వారితోపాటు, మృతి చెందిన వారి వివరాలు అప్డేట్ చేయకపోవడంతో జిల్లాలో 29 వేల పెన్షన్లు వలస వెళ్లిన, మరణించిన జాబితాలో ఉన్నట్లు గుర్తించామని, వీటిపై విచారించగా సంఖ్య 2 వేలకు వచ్చిందని, ఈ తరహా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ ఇలా త్రిపాఠి చెప్పారు.  గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కళాభారతిలో ' చేయూత స్కీం'  అమలు తీరుపై ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలతో డివిజన్ స్థాయి సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ను వినియోగించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, మొక్కల పెంపకంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. వర్షాకాలం సీజన్ పై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అడిషనల్​ ఇన్​చార్జి కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఆర్డీవో శేఖర్ రెడ్డి, రాష్ట్ర సెర్ప్ కార్యాలయ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ల పంపిణీ సంచాలకులు గోపాలరావు, ఇన్​చార్జి జడ్పీ సీఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.