ఐక్యతకు స్ఫూర్తిగా 2కే రన్

ఐక్యతకు స్ఫూర్తిగా 2కే రన్
  • ఉమ్మడి జిల్లాలో జాతీయ ఐక్యతా దినోత్సవం  
  • పాల్గొన్న పోలీస్​శాఖ, అధికారులు, పలు రాజకీయ పార్టీలు, యూత్​, విద్యార్థులు​
  • సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాలకు ఘన నివాళులు

వెలుగు, నెట్​వర్క్​: ఉక్కు మనిషి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పోలీస్​శాఖ, అధికారులు, పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవం నిర్వహించారు. పటేల్ విగ్రహాలకు ఘన నివాళులర్పించి ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఉక్కు మనిషి సర్ధార్‌ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్​ నగరంలో ఏక్తాదివస్​ రన్​ను కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య ప్రారంభించారు. పాత కలెక్టరేట్​ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే కమాన్​, అయ్యప్ప మందిరం మీదుగా నీలకంఠేశ్వర ఆలయం వరకు 2కే రన్​కొనసాగింది. 

2కే రన్​ గమ్యాన్ని త్వరగా చేరుకున్న సాయికిరణ్​, నాగేందర్​, రాకేష్​, ధరిణి, గోదావరి, నిఖితకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. అదనపు డీసీపీలు బస్వారెడ్డి, రాంచంద్రరావు, ఏసీపీలు రాజావెంకట్​రెడ్డి, మస్తాన్​అలీ, రిజర్వు ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్​, తిరుపతి నగరంలోని యూత్ పాల్గొన్నారు.  కామారెడ్డి జిల్లా కేంద్రంలో  ఎస్పీ రాజేశ్​చంద్ర ర్యాలీని ప్రారంభించి శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ ముందుంటుందన్నారు. 

అడిషనల్​ఎస్పీ కె. నరసింహారెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం నుంచి జన్మభూమి రోడ్డులోని పటేల్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, రాష్ట్ర నేత మురళీధర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్‌ నగరంలో శివాజీ చౌక్‌ నుంచి వర్ని చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్, ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. 

సిరికొండ లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో 2కే రన్‌ నిర్వహించారు. ఎస్సై రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.  తాడ్వాయి మండలంలో ఎస్సై నరేశ్​ఆధ్వర్యంలో 2కే రన్‌ నిర్వహించారు. శబరిమాత ఆలయం నుంచి ఓల్డ్‌ పెట్రోల్‌ బంక్‌ వరకు రన్‌ కొనసాగింది. మాజీ సర్పంచ్‌ బండారు సంజీవులు, మాజీ వైస్‌ ఎంపీపీ ముద్ద నర్సింహులు, వీడీసీ అధ్యక్షుడు మేకల రాజు పాల్గొన్నారు. నవీపేట్‌లో ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో 2కే రన్‌ నిర్వహించారు. 

పిట్లం మండలంలో తహసీల్దార్‌ రాజ నరేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమం జరిగింది. ఎస్సై వెంకట్రావు, ఎంఈవో దేవిసింగ్‌ పాల్గొన్నారు. మోపాల్‌ మండలంలో ఎస్సై సుస్మిత ఆధ్వర్యంలో  కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.  మెండోరా, ముప్కాల్‌, మోర్తాడ్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 2కే రన్‌లు నిర్వహించారు.  ఎస్సైలు సుహాసిని, రజనీకాంత్‌, రాము పాల్గొన్నారు.  బోధన్‌, సాలూర మండలాల్లో సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ యూనిటీ నిర్వహించారు. ఆచన్‌పల్లి నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. సీఐలు వెంకటనారాయణ, ఎస్సై మచ్ఛేందర్‌ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. నిజాంసాగర్‌లో ఎస్సై శివకుమార్‌ ఆధ్వర్యంలో 2కే రన్‌ నిర్వహించారు.